![]() |
![]() |
.webp)
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో మొత్తం పార్టీ థీమ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. పార్టీ థీమ్ అనేసరికి ఎలా ఉంటుంది...ఫుల్ రంగు రంగుల కాస్ట్యూమ్స్ తో మంచి జోష్ తో వచ్చారు అంతా. శ్రీముఖి కూడా కిర్రాక్ కాస్ట్యూమ్ తో వచ్చింది. "పార్టీ ఉంటుంది పుష్ప" అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. తేజస్విని మడివాడ ఐతే అచ్చం పార్టీ వేర్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని వచ్చేసరికి "పార్టీ మొత్తం నీలోనే కనిపిస్తోంది" అంటూ సెటైర్ వేసింది శ్రీముఖి. "పార్టీ అమ్మాయిలు చేసుకుంటే బాగుంటుందా అబ్బాయిలు చేసుకుంటే బాగుంటుందా" అని అడిగింది. "అమ్మాయిలు లేకుండా అబ్బాయిలకు పార్టీలో ఎంట్రీనే లేదు" అని చెప్పింది తేజు. "పార్టీలో కొంత మంది అబ్బాయిలు వుంటారు గ్లాస్ పట్టుకుని యు అని వచ్చేస్తారు..అక్కడ కూర్చున్న అమ్మాయిల్లో ఎవరిని చూస్తే యు" అని చెప్పాలని ఉంది అంటూ అమరదీప్ ని అడిగింది శ్రీముఖి. "అందరికీ చెప్పాలనిపిస్తుంది వాడికి" అంటూ వెనక నుంచి నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు.
తర్వాత పృద్వి దగ్గరకు వచ్చి " అక్కడ ఉన్న విష్ణుని తీసేస్తే మిగతా అమ్మాయిల్లో నువ్వు ఏ అమ్మాయితో పార్టీ చేసుకుంటావ్" అని అడిగింది. దానికి పృద్వి వెంటనే శ్రీముఖి భుజం మీద చెయ్యేసి నీతోనే అని ఇన్డైరెక్ట్ గా చెప్పాడు. దానికి శ్రీముఖి "మేమిద్దరమే పార్టీకి వెళ్తే నీకు ఒకే నా" అంటూ విష్ణుని అడిగేసరికి ఆమె చాలా డల్ గా పెట్టింది ముఖం. ఈ మధ్య విష్ణు- పృద్వి ఆన్ స్క్రీన్ పెయిర్ గా బాగా హిట్ అయ్యారు. వీళ్ళ రిలేషన్ పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా మిగతా వాళ్ళు షోలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరి విష్ణు, పృద్వి రిలేషన్ ఎంత దూరం కంటిన్యూ అవుతుందో చూడాలి.
![]() |
![]() |